‘ఆ వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్’.. ఎమోషనల్ కామెంట్స్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-09 12:07:02  IST  )

బాల్యం అనేది అందరి జీవితంలో ఒక మరవలేని జ్ఞాపకం(memory).

‘ఆ వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్’.. ఎమోషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: బాల్యం అనేది అందరి జీవితంలో ఒక మరవలేని జ్ఞాపకం(memory). బంగారు భవిష్యత్తుకు పునాది పడేది కూడా అప్పుడే అని చెప్పవచ్చు. ఎందుకంటే చిన్ననాటి నుంచి మన అలవాట్లు, అభిరుచులే మన ఫ్యూచర్‌(Future)ని విజయపథంలో నడిపిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే హృదయం చలించిపోతుంది.

వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం(Visakhapatnam)లోని ఓ ప్రాంతంలో ఓ బాలుడు.. ఒళ్లంతా సిల్వర్ రంగు పూసుకుని మహాత్మా గాంధీ వేషంలో రోడ్డుపై యాచిస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో అటువైపుగా వెళుతున్న ఓ యూట్యూబర్ ఆ పిల్లాడిని చూసి జాలి పడ్డాడు. వెంటనే ఆ పిల్లాడి దగ్గరకు వెళ్లి అతని సమస్యలు అడుగగా.. ఆ పిల్లాడు తన తల్లిదండ్రుల(Parents) అనారోగ్య గురించి చాలా దీనంగా చెప్పసాగాడు. ఆ బాలుడు మాటలు వింటున్న యూట్యుబర్‌ వీడియో తీసాడు. అనంతరం బాలుడిని ఆదుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సామాజిక మాధ్యమా(Social Media)ల్లో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఈ వీడియో చూసి చలించిపోయారు. ఈ ఘటనపై మంత్రి లోకేష్ వెంటనే స్పందిస్తూ.. ‘‘ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించి పోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను’’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Next Story