- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీకి పెట్టుబడులు.. మరో పర్యటనకు మంత్రి లోకేశ్
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటూ కెనాడాలో మంత్రి లోకేశ్ పర్యటించనున్నారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రానికి పెట్టుబడులు(Investments) రాబట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం(Coalition Government) పని చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల(National and international entrepreneurs)ను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వ నేతలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu), మంత్రి లోకేశ్(Minister Lokesh) విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో పర్యటించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. ఈ మేరకు రాష్ట్రంలో ఇప్పటికే పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి.
అయితే మరిన్ని పెట్టుబడులను సైతం ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్ మరో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 11, 12వ తేదీన కెనడాలో పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేశారు. మంత్రి లోకేశ్ వెంట సీఎం చంద్రబాబు కార్యదర్శి కార్తికేయ మిశ్రాతో పాటు ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్ సైతం కెనడా వెళ్లనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రెండు రోజుల పాటు కెనడాలో పర్యటించి పలు కంపెనీల యజమానులను కలవనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించనున్నారు.






