- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nara Lokesh : రాజ్యసభకు అమరావతి బిల్లు.. ఢిల్లీకి మంత్రి లోకేశ్
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధానిగా అమరావతి(Amaravati)కి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లుపై పార్లమెంట్(Parliament)లో చర్చ జరగనున్న నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) గురువారం ఢిల్లీ(Delhi) వెళ్లనున్నారు. అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రవేశపెట్టనున్న ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగే చర్చా కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం పొందడంతో మంత్రి లోకేశ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం
ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో అమరావతిపై ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రభుత్వం.. దానిని కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం పార్లమెంట్‌లో ఈ సవరణ బిల్లుపై చర్చ జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పర్యవేక్షించేందుకు, వివిధ పార్టీల మద్దతు కోరేందుకు లోకేశ్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం సైతం ఉంది. అమరావతి భవిష్యత్తుకు చట్టపరమైన భద్రత కల్పించడమే లక్ష్యంగా మంత్రి లోకేశ్ పర్యటన కొనసాగనుంది.






