‘డిప్యూటీ సీఎం’ పదవి పై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్.. ఏమన్నారంటే?

by Jakkula Mamatha |   ( Updated:2025-01-22 09:08:40.0  )
‘డిప్యూటీ సీఎం’ పదవి పై తొలిసారి స్పందించిన మంత్రి లోకేష్.. ఏమన్నారంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాల్లో డిప్యూటీ సీఎం(Deputy CM) పదవి పై చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రి నారా లోకేష్‌(Minister Nara Lokesh)ను డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నారా లోకేష్‌ను డిప్యూటీ చేయాలంటూ వరుసబెట్టి టీడీపీ నేతలు(TDP Leader) డిమాండ్ చేయడంతో ఆ అంశం జనసేనలో ప్రకంపనలు సృష్టించింది. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో టీడీపీ(TDP) అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని పార్టీ కేడర్ కు ఆదేశాలు జారీ చేసింది. జనసేన కూడా తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో స్పందించవద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించిన, పార్టీ లైన్ దాటిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇదిలా ఉంటే.. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్(Dawos) పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్‌ ఓ ఇంటర్వ్యూలో డిప్యూటీ సీఎం పదవి పై తొలిసారిగా స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో.. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పదవి గురించి వార్తలపై ప్రశ్నిస్తూ.. మీ రాజకీయ లక్ష్యం ఏమిటని మంత్రి లోకేష్‌ను ప్రశ్నించారు. దీనికి సమాధానంగా.. తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని లోకేష్ చెప్పారు. ఎన్నికల్లో తమను ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించారని, 94 శాతం సీట్లలో కూటమి అభ్యర్థులు గెలిచారని లోకేష్ తెలిపారు. ప్రస్తుతం తనకు చేతినిండా పని ఉందని, తనకు అప్పగించిన శాఖలపై పూర్తి స్థాయిలో పని చేస్తున్నానని చెప్పారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) పెట్టిన టార్గెట్‌లపై ఫోకస్ చేశానని తెలిపారు. గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ దారుణంగా తయారైందని చెప్పారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి లోకేష్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed