Andhra Pradesh:గురువైభవోత్సవం-2025 అవార్డ్ అందుకున్న ఏపీ మంత్రి

by Jakkula.Mamatha |

మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలకు శ్రీమఠం సర్వాంగ ఎంతో అందంగా అలంకరించారు.

Andhra Pradesh:గురువైభవోత్సవం-2025 అవార్డ్ అందుకున్న ఏపీ మంత్రి
X

దిశ,వెబ్‌డెస్క్: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలకు శ్రీమఠం సర్వాంగ ఎంతో అందంగా అలంకరించారు. పట్టాభిషేక మహోత్సవాలు పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు(Devotees) తరలిరానున్నారు. ఈ రోజు(శనివారం) నుంచి ఆరు రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు మంత్రి నారా లోకేశ్‌(Minister Nara Lokesh), మంత్రి టీజీ భరత్‌(Minister TG Bharath) ముఖ్య అథితులుగా హాజరై 404వ పట్టాభిషేక మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు రాష్ట్ర మంత్రులకు గురువైభవోత్సవ -2025 అవార్డులను అందజేశారు.

ఈ తరుణంలో మంత్రి లోకేష్ మంత్రాలయంలో గురువైభవోత్సవం అవార్డు అందుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు స్వామీజీ ఆయనను శాలువాతో సత్కరించి అవార్డును అందజేశారు. అంతకుముందు నారా లోకేష్ మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని గురువైభవోత్సవం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి లోకేష్(Minister Lokesh) మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని రాఘవేంద్ర స్వామి వారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.

Next Story