Minister Lokesh: తప్పుడు వార్తలు రాయడం ఆ పత్రిక నైజం.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-01-27 06:49:27  IST  )

తప్పుడు వార్తలు రాయడం ‘సాక్షి’ పత్రిక నైజమని మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Lokesh: తప్పుడు వార్తలు రాయడం ఆ పత్రిక నైజం.. మంత్రి లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తప్పుడు వార్తలు రాయడం ‘సాక్షి’ పత్రిక నైజమని మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ‘సాక్షి’ పత్రికపై ఆయన వేసిన పరువు నష్టం దావా (Defamation Suit)పై విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టు (Visakha 12th Additional District Court) విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలోనే ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ (Cross Examination)కు హాజరయ్యారు.

కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లో సాక్షి పత్రిక తనపై అసత్య ఆరోపణలు చేసిందని ఫైర్ అయ్యారు. అప్పుడు వారికి లీగల్ నోటీసులు (Legal Notices) జారీ చేశామని గుర్తు చేశారు. తప్పుడు వార్తలు పదే పదే దాసి అది నిజం చేయాలనుకోవడం ఆ పత్రిక నైజమని కామెంట్ చేశారు. ఈ కేసులో గత ఐదేళ్లుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని అన్నారు. ఇది నాలుగో వాయిదా అని.. నిజం తన వైపే ఉందని అన్నారు. ఎన్ని సార్లు పిలిచినా తాను కోర్టుకు వస్తానని.. చివరికి నిజమే గెలిచి తీరుతుందని మంత్రి లోకేశ్ అన్నారు.

Next Story