వారికి జర్మనీ, జపాన్ భాషలనూ నేర్పిస్తున్నాం: లోకేశ్

by Vemula.Srinu Prasad |

నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ భాషలనూ నేర్పిస్తున్నామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు..

వారికి జర్మనీ, జపాన్ భాషలనూ నేర్పిస్తున్నాం: లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో స్థానిక భాష తెలుగు అని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. తెలుగు భాష(Telugu language)ను బలవంతంగా రుద్దుతారని చెప్పడాన్ని తాను నమ్మనని ఆయన తెలిపారు. ఇతర భాషలు నేర్చుకోవడం అవసరమని చెప్పారు. ప్రపంచ భాషలు నేర్చుకోవడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు. నర్సింగ్‌ వృత్తిలో ఉండే వారికి జర్మనీ(Germany), జపాన్‌ భాషలను(Japanese languages) నేర్పిస్తున్నామన్నారు. దాని వల్ల ఆయా దేశాల్లో ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. పిల్లలకు ఏది ఇష్టమో అది నేర్చుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో తెలుగును ప్రమోట్‌ చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.


Next Story