అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం పై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి

by Jakkula.Mamatha |

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లా రోడ్డు ప్రమాదం పై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
X

దిశ,వెబ్‌డెస్క్: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిచెరువు కట్టపై ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘‘రోడ్డు ప్రమాదంలో రైల్వేకోడూరు శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందిన 9 మంది కూలీలు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. మామిడికాయల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడటంతో కూలీలు మృతి చెందడం బాధాకరం. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్యం అందించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Next Story