- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:‘మన మిత్ర’ ద్వారా అందుబాటులోకి 400 రకాల సేవలు.. మంత్రి లోకేష్ వెల్లడి
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) వెల్లడించారు. ఇవాళ(మంగళవారం) మంత్రి నారా లోకేష్ ఉండవల్లి(Undavalli) లోని తన నివాసంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని మంత్రి తేల్చి చెప్పారు. దీంతో వేగవంతంగా కార్యాకలాపాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ మేరకు యంత్రాంగానికి మంత్రి దిశానిర్దేశం చేశారు. రాబోయే ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్(Minister nara Lokesh) వెల్లడించారు. ఈ క్రమంలో పౌరసేవలను మరింత సులభతరం చేసేందుకు 'మన మిత్ర' యాప్‌లో(Mana Mitra App) అందుబాటులో ఉన్న 317 సేవలను నెలాఖరు(May) నాటికి 400కు పెంచాలని మంత్రి లోకేష్ ఆదేశించారు.






