- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఆలయానికి బస్సు సర్వీసులు నిలిపివేత.. స్పందించిన మంత్రి లోకేష్
కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడం పై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.

దిశ,వెబ్‌డెస్క్: కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేయడం పై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ క్రమంలో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అటవీ, ఆర్టీసీ శాఖలతో సమన్వయం జరిపిన అనంతరం, ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించాలని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) ఆదేశాలు జారీ చేశారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ గతంలో అక్కడి అన్నదాన సత్రాలను వ్యక్తిగత వ్యయంతో పునర్ నిర్మించి సేవలను పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు.
భక్తుల(Devotees) మనోభావాలు, ప్రయాణ సౌకర్యాల విషయంలో ప్రజా ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అయితే.. ఈ పునరుద్ధరణతో కాశీనాయన జ్యోతి క్షేత్రానికి వెళ్లే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఆలయ దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ బస్సు సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం భక్తుల సౌలభ్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి తెలిపారు.






