Nara Lokesh:‘వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం’.. ఆ వీడియో రిలీజ్ చేసిన మంత్రి లోకేష్

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-15 12:49:00  IST  )

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

Nara Lokesh:‘వారి కళ్లల్లో ఆనందం చూస్తున్నాం’.. ఆ వీడియో రిలీజ్ చేసిన మంత్రి లోకేష్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సూపర్ సిక్స్(Super Six) హామీల్లో భాగంగా జూన్ 12వ తేదీన ‘తల్లికి వందనం’ పథకం అమలు చేసింది. తల్లికి వందనం(Talliki vandanam) పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున డబ్బులు ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే, ఇందులో 13వేలు లబ్ధిదారుల ఖాతాలకు. 2వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కలెక్టర్ల ఖాతాలకు జమ చేస్తున్నారు.

ఈ తరుణంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అమలు అవుతున్న తల్లికి వందనం పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం అమలు చేసి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరిని చదివించి, ఇంకొకరిని పనికి పంపాలి అనేది వైసీపీ విధానమని మంత్రి లోకేష్ ఆరోపించారు. కానీ, ‘ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకోవాలి’ అనేది ప్రజా ప్రభుత్వం నినాదం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని తల్లుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం అని మంత్రి లోకేష్ తెలిపారు. తమకు తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయంటూ తల్లిదండ్రులు చెబుతున్న వీడియోను మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.

Next Story