- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం
by Malleboina Mahesh |
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం ఆస్ట్రేలియాలకు బయలు దేరాడు. రాష్ట్ర రాజధాని అమరావతిలో పెట్టుబడులే లక్ష్యంగా చేసుకొని ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. మంత్రి లోకేష్ రాత్రి ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ముందస్తుగానే ఈ సమాచారం అందుకున్న అక్కడి తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో సిడ్నీ ఎయిర్‌పోర్టు (Sydney Airport)కు చేరుకొని మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. కాగా లోకేష్ ఈ పర్యటనలో భాగంగా ఐదు రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉండనున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో.. తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గోననున్నారు.
Next Story






