- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మంత్రి లోకేష్ పాజిటివ్ ఎనర్జీ సూపర్’.. మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో(Tollywood hero) మంచు విష్ణు(Manchu Vishnu) ప్రజెంట్ కన్నప్ప మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో(Tollywood hero) మంచు విష్ణు(Manchu Vishnu) ప్రజెంట్ కన్నప్ప మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన కలల ప్రాజెక్ట్‌గా ఇది సిద్దమవుతోంది. ‘మహాభారతం’ ధారావాహిక ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 25వ తేదీన విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా హీరో మంచు విష్ణు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh)తో సమావేశమైనట్లు హీరో మంచు విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా పలు విషయాల పై చర్చించుకున్నట్టు తెలిపారు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియా(Social Media)లో మంచు విష్ణు షేర్ చేశారు. ‘నా సోదరుడు, డైనమిక్ విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో సానుకూల వాతావరణంలో పలు అంశాలపై మాట్లాడాను అన్నారు. అతని పాజిటివ్ ఎనర్జీ అద్భుతం. లోకేష్‌కు దేవుడు మరింత శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నా.. హర హర మహాదేవ’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో ప్రజెంట్ ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.






