- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి మంత్రి లోకేష్ నివాళులు
హైదరాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు.

దిశ,వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం పై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ‘‘తెలుగుదేశం పార్టీ తోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1982లో టీడీపీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కృషి చేశారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో తాజాగా(ఆదివారం) జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు సందర్శించి నివాళులు అర్పించారు. మాదాపూర్(Madhapur)లోని ఆయన నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం గోపీనాథ్(Maganti Gopinath) కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.






