- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రెండో విడత ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టండి!’.. అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు
మంగళగిరికి ఐటీ, ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: మంగళగిరికి ఐటీ, ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో భవిష్యత్‌లో 50 వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై అధికారులు దృష్టి సారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో 2 వేల ఇళ్ల పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
10వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం!
ప్రజలు నివసించేందుకు అనుకూలంగా వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 10వేల టిడ్కో ఇళ్లు నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ పై అధికారులు దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలను ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. తాడేపల్లి రిటైనింగ్ వాల్, మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, జెమ్స్ అండ్ జ్యూయలరీ పార్క్, సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, మోడ్రన్ లైబ్రరీ, పార్క్‌లు, స్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్షించారు.






