ఆ చిన్నారుల పరిస్థితి చూసి చలించిన మంత్రి లోకేష్.. వెంటనే రంగంలోకి!

by Jakkula.Mamatha |

రాష్ట్రంలోని ఆ గ్రామంలో చిన్నారులు పాఠశాలకి వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి.

ఆ చిన్నారుల పరిస్థితి చూసి చలించిన మంత్రి లోకేష్.. వెంటనే రంగంలోకి!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ఆ గ్రామంలో చిన్నారులు పాఠశాలకి వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఏపీ(Andhra Pradesh)లోని సొలబంగి(Solabangi) గ్రామంలోని చిన్నారులు బడికి వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు నడక సాగించాలి. ఈ క్రమంలో పిల్లల భవిష్యత్తు కోసం పెద్దలు, చదువు మీద ఇష్టంతో చిన్నారులు, ప్రాణాలకు తెగించి రోజూ రాకపోకలు సాగిస్తున్నారు. చదువుకోవడానికి స్కూల్(School), పక్క ఊరికి వెళ్లడానికి రోడ్డు లేని కారణంగా ఆ గ్రామంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో సొలబంగి గ్రామస్థులు సమస్యల పై ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) స్పందించారు. స్కూల్ కోసం మూడు కిలోమీటర్ల పడవ ప్రయాణం, 2 కి.మీ పొలం గట్లపై నిండా పదేళ్లు కూడా లేని చిన్నారులు నడిచి వెళ్తున్నారన్న కథనాలు చూసి మంత్రి లోకేష్ చలించారు. ఆ చిన్నారుల పరిస్థితి పై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. వెంటనే గ్రామంలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధికారులు పలువురు హాస్టల్‌లో ఉండి చదువుకునేలా, మిగతా విద్యార్థులు గ్రామంలోనే చదువుకునేలా ఏర్పాట్లు చేశారు.

Next Story