ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి..! Canva సంస్థతో మంత్రి లోకేశ్ భేటీ

by Ramesh Naini |

అమరావతి అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి..! Canva సంస్థతో మంత్రి లోకేశ్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరావతి అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటనలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ కంపెనీలతో పెట్టుబడుల అవకాశాలను చర్చిస్తూ వరుసగా భేటీలు జరుగుతున్నాయి. ఇవాళ సాన్‌ఫ్రాన్సిస్కోలో Canva సంస్థ చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రాబ్ గిగ్లియోతో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకుంటోందని, ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్టులకు Canva వంటి సంస్థల భాగస్వామ్యం కీలకమని ఆయన తెలిపారు. యువతకు క్రియేటివ్ స్కిల్స్, డిజిటల్ డిజైన్, నూతన తరహా ఉద్యోగావకాశాలను విస్తరించే దిశగా కలిసి పనిచేయాలని ఆయన ఆహ్వానం పలికారు. ‘ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ ఎకానమీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉత్తేజకరమైన అవకాశాలు ఉన్నాయి’ అని లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. లోకేశ్ పర్యటనలో టెక్ కంపెనీల సీఈవోలు, ఇన్వెస్ట్మెంట్ ప్రతినిధులు వరుసగా కలుసుకుంటుండటంతో రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Next Story