- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘చేయి వీడని చెలిమి’ నవలను ఆవిష్కరించిన మంత్రి లోకేష్
ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం అడ్డంకి కాదని సాయిజ్యోతి నిరూపిస్తున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే వైకల్యం అడ్డంకి కాదని సాయిజ్యోతి నిరూపిస్తున్నారు. పుట్టుకతో వచ్చిన అంధత్వంతో ఆమె ఏ మాత్రం కుంగిపోకుండా తనలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు. నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. అంధత్వాన్ని జయించి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని రచయిత్రిగా మారిన సాయిజ్యోతి ‘చైత్రశ్రీ’ అనే కలం పేరుతో ‘కవితాంజలి’ అనే కవితా సంపుటిని, ‘మంచు తాకిన ప్రేమ’, ‘ఎవరు అతను’ వంటి నవలలను పాఠకులకు అందించారు. తాజాగా ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను రచించారు. ప్రస్తుతం ఆమె నూతక్కి హైస్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ తరుణంలో మంగళగిరి 26వ వార్డుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు సాయిజ్యోతి రచించిన ‘చేయి వీడని చెలిమి’ అనే నవలను ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అంధురాలైన సాయిజ్యోతి మొబైల్ లో వాయిస్ ఇన్ పుట్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రచనలు సాగిస్తున్నారు. వైకల్యాన్ని అధిగమించి తన ప్రతిభతో యువతరానికి స్ఫూర్తి గా నిలుస్తున్న ఆమెకు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు.






