- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్ర సమస్యలపై మంత్రి లోకేశ్ ఫోకస్: ఢిల్లీలో కేంద్రమంత్రులతో కీలక చర్చలు
రాష్ట్ర సమస్యలపై ఢిల్లీలో కేంద్రమంత్రులతో మంత్రి లోకేశ్ చర్చలు జరుపుతున్నారు...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నారా లోకేశ్ న్యూఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్ర సమస్యలపై ఆయన పలువురు కేంద్రులను కలుస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్రమంత్రులను కలిశారు. తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. ఏపీలో కొత్త ప్రాజెక్టులకు సహకారం అందించాలని లోకేశ్ కోరారు.
అంతకుముందు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri)ని కలిశారు. రాష్ట్రంలోని ప్రతిపాదిత ప్రాజెక్టులకు వేగవంతమైన అనుమతులు, సాంకేతిక మద్దతు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీపీసీఎల్ సంస్థ నిర్మించే రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ త్వరితగతిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు సహకారం అందించాలని కోరారు. రామాయపట్నం పోర్టు సమీపాన బీపీసీఎల్ సంస్థ 6వేల ఎకరాల్లో రూ.95వేల కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన రిఫైనరీ – కమ్ – పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు సంబంధించి పనుల పురోగతిని వివరించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకారం అందించాలని హర్దీప్ సింగ్ పూరికి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.






