విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-12-12 05:11:50  IST  )

మంత్రి లోకేశ్ నేడు విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాగ్నిజెంట్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మ‌హ‌తి ఫిన్టిక్ భ‌వ‌నంలో ఈ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు.

విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: మంత్రి లోకేశ్ నేడు విశాఖ‌లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కాగ్నిజెంట్ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మ‌హ‌తి ఫిన్టిక్ భ‌వ‌నంలో ఈ కార్యాల‌యాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో ఎంపీ భ‌ర‌త్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు పాల్గొన్నారు. కాగ్నిజెంట్ కార్యాల‌య ప్రారంభోత్స‌వానికి ముందు లోకేష్ విశాఖ టీడీపీ కార్యాల‌యానికి వెళ్లారు. అక్క‌డ ప్ర‌జ‌ల నుండి ఆర్జీల‌ను స్వీక‌రించారు.

ప్ర‌తిఒక్క‌రినీ ప‌ల‌క‌రించి వివిధ స‌మ‌స్య‌ల‌పై ఆర్జీల‌ను స్వీక‌రించారు. ఫించ‌న్లు, ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్న‌వారు లోకేష్ కు విన‌తులు ఇవ్వ‌గా వాటిని ప‌రిశీంచి త్వ‌ర‌లోనే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే నారాలోకేశ్ ఐటీ మంత్రిగా ఎన్నికైన తరవాత రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ కంపెనీలను తీసుకువచ్చి విశాఖను ఐటీ హబ్ గా మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు కంపెనీలు విశాఖకు రాగా నేడు శంకుస్థాపన చేస్తున్నారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సైతం పాల్గొంటున్నారు.

Next Story