- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
APకి మరో భారీ పరిశ్రమ.. ‘అశోక్ లేలాండ్ ప్లాంట్’ ప్రారంభించిన మంత్రి లోకేష్
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) మరో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే గత టీడీపీ(TDP) ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో అశోక్ లేలాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ సంస్థ ఎలక్ట్రికల్ బస్ బాడీ బిల్టింగ్ ప్లాంట్ నెలకొల్పింది. ఈ తరుణంలో దీన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేద్దామనే లోపే అధికారంలోకి వైఎస్‌ఆర్‌సీపీ(YSRCP) వచ్చింది.
ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం అశోక్ లేలాండ్(Ashok Leyland Plant)కు తగిన సహకారం ఇవ్వలేదు. దీంతో మళ్లీ ఎన్డీయే కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ప్లాంట్ ప్రారంభోత్సవానికి చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నేడు(బుధవారం) కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ‘అశోక్ లేలాండ్ ప్లాంట్’ ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌ను పరిశీలించిన ఆయన ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
ఈ ప్లాంట్ ప్రారంభంతో రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంట్ ఇది. మల్లవల్లి యూనిట్ నుంచి దేశవ్యాప్తంగా బస్సుల సరఫరా ఉంటుంది. ఈ ప్లాంట్‌తో తొలివిడతలో 600మందికి, మలివిడతలో 1200 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు. మల్లపల్లిలో 75 ఎకరాల్లో ఉన్న అశోక్ లేలాండ్ ప్లాంట్‌లో బీఎస్-4 మోడల్ బస్సుల ఉత్పత్తి, ఎలక్ట్రిక్ వాహనాల బాడీ బిల్డింగ్‌ను చేపట్టనున్నారు.






