- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం.. టాప్ 10 పెర్ఫార్మర్స్‌కు లోకేశ్ ఘన సత్కారం
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ 'మై టీడీపీ' యాప్ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు...

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) 'మై టీడీపీ' యాప్(My Tdp APP) ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టాప్ 10 కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు లభిస్తుందని, వారి పనితీరే నేడు వారిని ఈ స్థాయికి చేర్చిందని ఆయన ప్రశంసించారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో సక్రమంగా నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ(Telugudesam Party) వందేళ్ల పాటు ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని లోకేష్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లాలి..
పార్టీ ఆశయాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. సాంకేతికతను జోడించి యాప్‌ను సమర్థవంతంగా వినియోగించినందుకు గానూ ఉత్తమ కార్యకర్తలను లోకేష్ ఘనంగా సత్కరించారు. నిరంతరం కష్టపడే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో పనిచేయాలని లోకేష్ పిలుపునిచ్చారు.






