- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రానికి సహకారం అందించండి: కేంద్రమంత్రిని కోరిన మంత్రి లోకేశ్
రాష్ట్రానికి సహకారం అందించాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను మంత్రి లోకేశ్ కోరారు...

దిశ, వెబ్ డెస్క్: నైపుణ్య గణనకి సహకారం అందించాలని కేంద్ర రైల్వే, సమాచార, ప్రసార, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్(Union Minister Ashwini Vaishnav)ను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) కోరారు. పలు ప్రాజెక్టులపై న్యూఢిల్లీలో కేంద్రమంత్రితో ఆయన చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్య గణన కోసం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో రూపొందించిన నైపుణ్యం పోర్టల్‌పై కేంద్రమంత్రికు వివరించారు. అలాగే మంగళగిరిలో నిర్వహించిన పైలెట్ ప్రాజెక్ట్, అందులో ఎదుర్కున్న సమస్యలు అధిగమించడానికి ఏఐ ఆధారిత ఇంటర్వూ విధానం తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే నైపుణ్య గణనకు కేంద్ర సహాయం కావాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో యువ పారిశ్రామికవేత్తలు, ఔత్సాహిక వ్యవస్థాపకులకు అద్భుతమైన వేదికగా ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు MeitY స్టార్టప్ హబ్ మద్దతుగా నిలవాలని లోకేశ్ కోరారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో AVGC-XR, WAVEX ఫ్రేమ్‌వర్క్ కింద InnoXR యానిమేషన్, AR/VR, Immersive Technologies కోసం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు సహకారం అందించాలని సూచించారు. ఇండియా ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) మిషన్ కింద రాష్ట్రంలో ఏఐ విస్తృతి వేగవంతానికి మద్దతుగా నిలవాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.






