- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh: ‘ఇబ్బంది పెడితే ఊరుకోం’.. పోలీసులకు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఏపీ విద్యాశాఖ(Education Minister) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నేడు(శుక్రవారం) మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్నారు

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ విద్యాశాఖ(Education Minister) మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) నేడు(శుక్రవారం) మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్(NTR Bhavan)లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.3వేల కోట్ల ఫీజు రియంబర్స్ బకాయిలు పెట్టిందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక రూ.800 కోట్ల రియంబర్స్ బకాయిలు చెల్లించాం అని తెలిపారు. వైఎస్ జగన్ పెట్టిన ఫీజు బకాయిల పై వైసీపీ ఆందోళన వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన ధాన్యం పెండింగ్ బిల్లులు, ఉద్యోగుల బకాయిలు తీరుస్తున్నాం అన్నారు.
ఈ క్రమంలో కొంత మంది పోలీసుల(Police)పై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం(Party Central Office) ఎన్టీఆర్ భవన్‌లో పోలీసుల అత్యుత్సాహంపై మంత్రి లోకేష్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో పోలీసులు ఎందుకు ఎక్కువ ఉన్నారంటూ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఇక్కడికి ఎక్కువ మంది పోలీసులు ఎందుకు వచ్చారని అధికారులను మంత్రి లోకేష్ ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో జరిగే పోలిట్ బ్యూరో సమావేశానికి కూడా ఇంత మంది పోలీసులు అవసరమా? అని అధికారులను నిలదీశారు.
బందోబస్తు పేరుతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయవద్దని మంత్రి లోకేష్ చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రతిరోజు కార్యకర్తలు వస్తారు. ఈ క్రమంలో వారి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెట్టొద్దు అంటూ హితువు పలికారు. మా పార్టీకి కార్యకర్తలే బలం అని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు పోలీసులు హడావుడితో వారిని ఇబ్బంది పెట్టడం వంటివి చేయొద్దు అని మంత్రి లోకేష్(Minister Nara Lokesh) పోలీసులకు సూచించారు.






