- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
విశాఖపట్నం(Vishakapatnam)లో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైంది

దిశ,వెబ్‌డెస్క్: విశాఖపట్నం(Vishakapatnam)లో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా నిర్వహించే ‘‘యోగాంధ్ర కార్యక్రమం’’ అత్యంత కీలకమైంది. ఆ రోజున సాధించబోయే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ మహానగరం వైపు చూస్తోంది. ప్రధాని మోడీజీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ(AU)లోని సాగరిక కన్వెన్షన్ హాల్‌లో ఈనెల(జూన్) 21న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి లోకేష్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్(Minister Nara Lokesh) మాట్లాడుతూ.. ఒకే ప్రాంతంలో 5 లక్షల మందితో నిర్వహించే ఈ ఈవెంట్ ప్రపంచంలోనే అతి పెద్దదిగా చరిత్ర సృష్టిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాబోతున్నారని మంత్రి లోకేష్ గుర్తు చేశారు. ఈ క్రమంలో అధికారులకు కీలక సూచనలు చేశారు. అధికారులంతా పట్టుదల, క్రమశిక్షణ, కమిట్మెంట్‌తో పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహించాలి. యోగా వల్ల ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుందని ప్రధాని మోడీ(PM Modi) చెబుతున్నారు. దీనిపై ప్రసార మాధ్యమాల్లో విస్తృత ప్రచారం కల్పించాలి.
ఈనెల 21న ఆర్ కె బీచ్ నుంచి భీమిలి వరకు 26 కి.మీ.ల పొడవున 247 కంపార్ట్మెంట్లలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. ఆరోజు ఉదయం 6.30గంటలకు ప్రధాని ఆర్ కె బీచ్ కాళీమాత ఆలయం వద్ద ప్రధాన ప్రాంగణానికి చేరుకుంటారు. అంతకు గంటముందే ప్రజలంతా ఆయా కంపార్ట్మెంట్లకు చేరేలా రవాణా సౌకర్యం కల్పించండి.
సుదూర ప్రాంతాల్లో నిలిపివేసి ఇబ్బందులకు గురి చేయవద్దు. 600 మీటర్లకు మించి ప్రజలను నడిపించకుండా వాహనాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు ఇళ్ల వద్ద నుంచి ప్రాంగణానికి చేరి.. మళ్లీ తిరిగి వారు ఇంటికి చేరే వరకు బాధ్యత తీసుకోవాలి. 19, 20, 21 తేదీలు కీలకం, అధికారులంతా ప్రణాళికాబద్ధంగా, కలసికట్టుగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మంత్రి నారా లోకేష్ అధికార యంత్రాంగాన్ని కోరారు.






