న్యాయం చేస్తాం.. నాయీబ్రాహ్మణులకు మంత్రి కీలక హామీ

by Vemula.Srinu Prasad |

నాయీబ్రాహ్మణులకు న్యాయం చేస్తామని మంత్రి లోకేశ్ కీలక హామీ ఇచ్చారు...

న్యాయం చేస్తాం.. నాయీబ్రాహ్మణులకు మంత్రి కీలక హామీ
X

దిశ, వెబ్ డెస్క్: దేవాదాయ శాఖ కింద రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయీ బ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ(Bharat Nai Brahmin Rights Protection Service), సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్‌(Minister Nara Lokesh)ను కలిసి విజ్ఞప్తి చేశారు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం.. నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని, వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై, డిప్లమో అర్హత కలిగిన పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు. గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసం ఉంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటకు చెందిన గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటావూరులో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని.. బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరతగతిన నష్టపరిహార నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు మంత్రి నారా లోకేష్‌ను కలిసి విన్నవించారు. గత టీడీపీ సానుభూతిపరుడిననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబంపైన 42 అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

Next Story