ఎర్ర బస్సు రాని గ్రామాలకు ఎయిర్ బస్ ఎందుకని జగన్ అన్నారు.. మంత్రి లోకేష్ ఫైర్

by Ajay Maddhiboyina |

మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారాలోకేష్ ఫైర్ అయ్యారు. క్రెడిట్ కోసం తాము పోరాడటంలేదని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెద్దఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికే అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు.

ఎర్ర బస్సు రాని గ్రామాలకు ఎయిర్ బస్ ఎందుకని జగన్ అన్నారు.. మంత్రి లోకేష్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ సీఎం జగన్‌పై మంత్రి నారాలోకేష్ ఫైర్ అయ్యారు. క్రెడిట్ కోసం తాము పోరాడటంలేదని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పెద్దఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికే అహర్నిశలు కష్టపడుతున్నామని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎర్రబస్స కూడా రాని గ్రామాలకు ఎయిర్ బస్ అవసరమా అని అన్నారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ క్రెడిట్ వైసీపీదేనని చెప్పడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. జీఎంఆర్ కు 2600 ఎకరాలను కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు.

అప్పట్లో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చంద్రబాబు 5వేల ఎకరాలు ఇస్తే విమర్శించారన్నారు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్ పోర్టుకు స్థలం సరిపోక మరో ఎయిర్ పోర్ట్ కు స్థలం కోసం వెతుకుతున్నారని అన్నారు. మౌలిక వసతులపై వ్యతిరేకంగా మాట్లాడిన వారు, నేడు వాటి ఫలితాలను స్వంతం చేసుకునే ప్రయత్నం చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం విమర్శించారు. ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని, ఎవరు అడ్డుకున్నారు, ఎవరు అభివృద్ధి చేశారు అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ఇదిలా ఉంటే భోగాపురం ఎయిర్ పోర్ట్ క్రెడిట్ తమదేనని వైసీపీ ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

Next Story