- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Lokesh : నీట్ విజేతలకు మంత్రి లోకేష్ అభినందన
నీట్(NEET) యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులను ఏపీ ఐటీ మంత్రి లోకేష్(Minister Lokesh) అభినందనలు తెలియజేశారు.

దిశ, వెబ్ డెస్క్ : నీట్(NEET) యూజీ పరీక్షా ఫలితాల్లో టాప్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులను ఏపీ ఐటీ మంత్రి లోకేష్(Minister Lokesh) అభినందనలు తెలియజేశారు. నీట్ ఓపెన్ కేటగిరీలో 19వ ర్యాంక్, ఏపీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన డి.కార్తీక్ రామ్ కిరీటిని స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఉండవల్లికొని తన నివాసంలో కలిసిన లోకేష్.. కార్తీక్ ను ప్రశంసించారు. అదేవిధంగా జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 113వ ర్యాంక్ సాధించిన పాలకొల్లుకు చెందిన కోటిపల్లి యశ్వంత్ సాత్విక్, 311వ ర్యాంక్ సాధించిన రాజమహేంద్రవరానికి చెందిన కంచుమర్తి ప్రణీత్ ను కూడా వారి తల్లిదండ్రులతో సహా కలిశారు. తమ ప్రతిభతో జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆయా విద్యార్థులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. వీరంతా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు.






