గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం.. మంత్రి లోకేష్ శుభాకాంక్షలు

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సినీయర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే.

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు ప్రమాణం.. మంత్రి లోకేష్ శుభాకాంక్షలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కి చెందిన టీడీపీ సినీయర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఈ రోజు(శనివారం) ఉదయం గోవా గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే ఇవాళ ఉదయం 11.30గంటలకు అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ తరుణంలో తాజాగా ఏపీ విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారానికి ఈరోజు(శనివారం) హాజరైనట్లు మంత్రి లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజుని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌ని కూడా మర్యాద పూర్వకంగా కలిశానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ట్వీట్

Next Story