- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Nara Lokesh: పార్క్‌లో చెత్తను శుభ్రం చేసిన మంత్రి లోకేష్
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంల నిర్వహించారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఎకో పార్క్‌లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) పాల్గొన్నారు. ఈ క్రమంలో పార్క్‌లో చెత్తను శుభ్రం చేసి స్వయంగా చెత్తకుండీలో వేశారు.
పారిశుద్ధ్య కార్మికుడితో మంత్రి లోకేష్ ముఖాముఖి..
స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్.నాగార్జునతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఊరు, ఎక్కడ పని చేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా.. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నానని తెలిపారు. 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాని అతను చెప్పారు. ఎంతమంది పిల్లలు, ఎక్కడ చదువుతున్నారని మంత్రి అడగగా.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. అమ్మాయి పదో తరగతి, అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నారని, ఇద్దరినీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు.
ప్రభుత్వ పాఠశాలలో చదువు బాగుందని, మధ్యాహ్న భోజనం కూడా బాగా పెడుతున్నారని చెప్పాడు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ.. ప్రభుత్వ పాఠశాలలను ఇంకా మెరుగుపర్చాల్సి ఉందని, మధ్యాహ్న భోజన పథకంలో మెనూ కూడా మార్చామని ఈ సందర్భంగా చెప్పారు. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన సామగ్రి ఏ విధంగా ఉందని, చెత్తకుండీలు ఉన్నాయా అని అడగగా.. చేతికి వేసుకునే గ్లోవ్స్ మరింత మందంగా ఉండాలని సూచించారు. ఎకో పార్క్ లో ఇంకా ఏమేం చేస్తే బాగుంటుందని మంత్రి అడిగారు. ప్రతి ఆదివారం పిల్లలు పెద్ద ఎత్తున పార్క్ కు వస్తున్నారని, వాకర్స్ ఆనందంగా ఉన్నారని సమాధానం ఇచ్చాడు. పిల్లలు బాగా చదవాలని, వారు ఎదిగే లోగా మంగళగిరి బాగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు ప్రజలంతా నిద్రకు ఉపక్రమించి తర్వాత వారు మేల్కొని పరిసరాలను పరిశుభ్రంగా మారుస్తారని మంత్రి ప్రశంసించారు. మంగళగిరిని పరిశుభ్రంగా మార్చారని కొనియాడారు. మంగళగిరి ఎకో పార్క్ బాగుందని, మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాలి. అందుకే కూటమి ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తోందని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణలో మంగళగిరిని నెం.1 నిలబెడతామని అన్నారు.
ముఖాముఖి అనంతరం.. పారిశుద్ధ్య కార్మికుడు నాగార్జునను మంత్రి శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఎకో పార్క్ లో వాకింగ్ చేసే మంగళగిరి వాసులకు సొంత నిధులు రూ.5 లక్షలు వెచ్చించి ఉచిత ప్రవేశం కల్పించిన మంత్రి నారా లోకేష్‌ను నేచర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.






