- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాన్ బాస్కో పాఠశాల వేడుకలకు హాజరైన మంత్రి లోకేశ్
మంగళగిరి మండలం పరధిలోని డాన్ బాస్కో పాఠశాల (Don Bosco School) తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : మంగళగిరి మండలం పరధిలోని డాన్ బాస్కో పాఠశాల (Don Bosco School) తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఈ మహోత్సవానికి రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Ministe Nara Lokesh) ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మంత్రికి ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులతో కలిసి స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని మంత్రి నారాయ లోకేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాపించి విజయవంతంగా ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేశారు. గత యాభై సంవత్సరాలుగా ఎంతో మంది విద్యావంతులను తీర్చిదిద్దడంలో పాఠశాల ముఖ్య భూమికి పోషిచిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని మైలురాళ్లను దాటాలని కాంక్షించారు. అనంతరం పాఠశాల విద్యార్థులను ఆత్మీయంగా పలకరించారు. వారిలో ఒకరిగా కలిసిపోయి ముచ్చట్లు పెట్టారు. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఆటపాటలు కూడా ఉన్నాయా అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించి సమాధానాలు తెలుసుకున్నారు. భవిష్యత్తు లక్ష్య సాధన కోసం ఇష్టంగా చదుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ప్రయోగశాలను ప్రారంభించారు. ప్రయోగశాల వల్ల విద్యార్థుల్లో సైన్స్, టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.






