- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Nara Lokesh:టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మంత్రి లోకేష్?
రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఈ ఏడాది(2025) మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో టీడీపీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే మహానాడు ఈ ఏడాది(2025) మే నెలలో 27, 28, 29 తేదీల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల(మే) 29వ తేదీన సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఈ సభలో పార్టీ బలోపేతం పై టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడనున్నారు. అయితే.. మూడు రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా జరగనున్న మహానాడుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావటంతో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతోంది. ఈ తరుణంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) త్వరలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ప్రభుత్వ పాలనపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యకలాపాల బాధ్యతను మంత్రి లోకేష్‌కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల(మే) చివరన టీడీపీ మహానాడు(Mahanadu)లో ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ(TDP)లో యువతకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వాలంటున్న సీఎం చంద్రబాబు(CM chandrababu) తన నుంచే దీన్ని అమలు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ అంశం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రచారం పై స్పష్టత రావాలంటే ఈ నెల చివరి వరకు వేచి చూడాల్సిందే.






