- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తల్లికి వందనం పెండింగ్ నిధులకు మంత్రి లోకేష్ ఆమోదం
తల్లికి వందనం పెండింగ్ నిధుల విడుదలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆమోదం తెలిపారు. శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం (Talliki Vandanam) దరఖాస్తులకు ఆమోదం తెలిపి రూ.325 కోట్ల నిధులను విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తల్లికి వందనం పెండింగ్ నిధుల విడుదలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆమోదం తెలిపారు. శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పెండింగ్ లో ఉన్న తల్లికి వందనం (Talliki Vandanam) దరఖాస్తులకు ఆమోదం తెలిపి రూ.325 కోట్ల నిధులను విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని అధికారుల్ని ఆదేశించారు. టీచర్లకు శిక్షణా కార్యక్రమాల పేరు చెప్పి వారి సమయాన్ని వృథా చేయవద్దని, విద్యార్థులకు మెరుగైన ఫలితాలొచ్చేలా చూడాల్సిన బాధ్యత టీచర్లు, అధికారులదేనని స్పష్టం చేశారు.
ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ ప్రకటించి.. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్ని భర్తీ చేస్తామని వెల్లడించారు. అలాగే రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో సైన్స్ ఫేర్, స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతోన్న విధానాలను స్టడీ చేసి.. రాష్ట్రంలో బెస్ట్ ప్రీ స్కూల్ పాలసీని రెడీ చేయాలని సూచించారు.






