- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలవరంలో దారుణం.. మంత్రి సత్యకుమార్ సీరియస్
ఏలూరు జిల్లా పోలవరం మండలంలో జరిగిన దారుణంపై మంత్రి కుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు..

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Eluru District) పోలవరం మండలం(Polavaram Mandal)లో దారుణం జరిగింది.వైద్య అందక నిండు గర్భిణి మృతి చెందారు. కొత్తకొంకాల గ్రామానికి చెందిన గర్భిణి శిరీషకు పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఆమెను పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు లేకపోవడంతో నర్సు పరీక్షలు నిర్వహించారు. అయితే గర్భణి(Pregnant Womean) పరిస్థితి విషమించడంతో రాజమండ్రికి తీసుకెళ్లాలని సూచించారు. కాసేపట్లో గర్భిణి మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి శిరీష చనిపోయిందని ఆరోపించారు.
అయితే ప్రసవం కోసం వచ్చిన గర్భిణి మృతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satya Kumar) స్పందించారు. గర్భిణీ కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్‌ను ఆదేశించారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.






