- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లందరికీ రూ.10 లక్షల ప్రమాద బీమా.. మంత్రి ప్రకటన
సంఘ సహాయకులకు పది లక్షల ప్రమాద బీమా అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చలు చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొండపల్లి.

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ ( Kondapalli Srinivas) కీలక ప్రకటన చేశారు. ఏపీలో ఉన్న గ్రామ సంఘ నాయకుల సేవలు సమర్థవంతంగా అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడలో 28 జిల్లాలకు సంబంధించిన 28,500 మంది గ్రామ సంఘ సహాయకుల స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. డిజిటల్ కమ్యూనికేషన్ ను బలోపేతం చేసేందుకు ఫోన్లు ఇస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. సంఘ సహాయకులకు పది లక్షల ప్రమాద బీమా అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చలు చేసి అమలు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొండపల్లి. దీనిపై త్వరలోనే ప్రకటన రానుందని ప్రకటించారు.
Next Story






