ఏ రాష్ట్రంలో ఇలా లేదు.. పారిశ్రామిక విధానంపై మంత్రి కొండపల్లి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |

నూతన పారిశ్రామిక విధానంపై మంత్రి కొండపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు..

ఏ రాష్ట్రంలో ఇలా లేదు.. పారిశ్రామిక విధానంపై మంత్రి కొండపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) అన్నారు. ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్ పో‌(AP Chambers Business Expo)లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఎలా ఆలోచించారో మనం చూశామని గుర్తు చేశారు. ఐటీకి భవిష్యత్తు ఉంటుందని, నాటి యువతను ప్రోత్సహించారని, అవసరమైన మౌళిక సదుపాయాలను ఆ నాడు ఏర్పాటు చేశారని తెలిపారు. తాను ఐటీ రంగంలో 16 ఏళ్ళు రాణించానంటే చంద్రబాబు ఆనాడు ఏర్పాటు చేసిన విధానాలే కారణమని చెప్పారు. ప్రతీ ప్రొడక్ట్ కూడా భారత సమాజంలో విక్రయించే అవకాశం ఉంటుందని, ప్రపంచంలో వాడే ప్రతీ వస్తువు భారత్‌లో వినియోగిస్తారని తెలిపారు. భారత్(Bharat) వైపు ప్రపంచం చూస్తోందని, పెట్టుబడులు ఎలా పెట్టాలని, ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఎన్‌డీఏ ప్రభుత్వం, ప్రధాని పని చేస్తున్నారని పేర్కొన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఏరో స్పేస్, బయో టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో క్లస్టర్‌లను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నారని వ్యాఖ్యానించారు. చిన్న తరహా పరిశ్రమలు అన్నీ ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు.

‘‘పెద్ద పరిశ్రమలు వచ్చే దగ్గర చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. వాటిని చిన్న తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలి. వ్యవసాయ ఉత్పత్తులకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా మనం పని చేయాలి. మన దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు అవుతాయి. వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా అడుగులు వేయాలి. స్థానిక ఉత్పత్తులను గుర్తించి వాటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కు వెళ్లి, ఉన్న సమస్యలు అక్కడ వివరిస్తే, మీ పారిశ్రామిక భవిష్యత్తుకు కావాల్సిన పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి సిద్దాంతం ప్రపంచంలో జర్మనీలో ఉంది. విద్యార్ధులను పారిశ్రామిక రంగానికి అనుసంధానం చేసే వ్యవస్థ ఇది. నారా లోకేష్.. ఈ వ్యవస్థను దగ్గర ఉండి మానిటర్ చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను కేటాయించారు. వెంచర్ క్యాపిటల్ క్రియేట్ చేసి.. మానిటైజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో తెలుసుకోవాలి. ఒక కుటుంబం ఒక పారిశ్రామిక వేత్త విధానాన్ని అందరూ వాడుకోవాలి. యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలి. మీ ఐడియా‌కు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యరూపం ఇస్తుంది. రుణ, మార్కెట్, ప్రాజెక్ట్ తయారీ సహా ఇతర సహకారాలను మీకు ప్రభుత్వం అందిస్తుంది. మార్కెట్‌ను ఏ విధంగా పెంచుకోవాలనే దానిపై అందరూ కృషి చేయాలి.’’ అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Next Story