విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి

by Naga Rani Yarlagadda |

తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి విజయవాడ ఇంద్రకీలాద్రి కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థ, ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు, పాలకమండలి సభ్యులు అమ్మవారి జ్ఞాపిక, శాలువాతో మంత్రిని సత్కరించారు. ఆయన వెంట ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ నిరంజన్ రెడ్డి, పలువురు స్థానిక నేతలు ఉన్నారు.

ఆలయానికి వచ్చిన మంత్రితో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు వచ్చారు. వారికి మంత్రి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను అమ్మవారిని అత్యంత ఆరాధిస్తానని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.

Next Story