AP News:2025-26 బడ్జెట్ పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో 2025-26 ఆర్థిక సంవత్సారానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ఇవాళ(శుక్రవారం) ప్రెవేశ పెట్టారు.

AP News:2025-26 బడ్జెట్ పై మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2025-26 ఆర్థిక సంవత్సారానికి గాను వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల ఇవాళ(శుక్రవారం) ప్రెవేశ పెట్టారు. ఈ వార్షిక బడ్జెట్ పై మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమానికి ఊతమిచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. ఎన్నికల మేనిఫెస్టో హామీలు అమలు లక్ష్యంగా బడ్జెట్ కేటాయింపులు ఉండడం ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దం పడుతున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయం అన్నారు. గతంలో సంక్షేమానికి నిధులు కేటాయించి ఇతర అవసరాలకు మళ్లించి బడుగు బలహీనవర్గాలను దగా చేశారని మంత్రి మండిపడ్డారు.

కానీ నేటి బడ్జెట్ లో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉంది. బడ్జెట్‌లో బీసీల కోసం చేసిన కేటాయింపులు కూటమి ప్రభుత్వం బీసీలకు ఏ స్థాయి ప్రాధాన్యం ఇస్తుందో మరోసారి నిరూపించారు. బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు, ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు కేటాయించడం శుభపరిణామం. గత ఐదేళ్ల బీసీ సంక్షేమాన్ని గాలికి వదిలేశారు చేతివృత్తుల వారికి అండగా నిలిచే ఆదరణ పథకాన్ని నిలిపివేసి బీసీలకు అన్యాయం చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆదరణ పథకానికి బడ్జెట్ కేటాయించి, పథకాన్ని పునః ప్రారంభించడం జరిగిందన్నారు.

బీసీల అభివృద్ధికి దోహదం చేసేలా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇచ్చిన సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు రాష్ట్రంలోని బీసీల అందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి వంటి అభివృద్ధి, గృహ నిర్మాణం, రోడ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయింపులు అభినందనీయం సారా రహిత రాష్ట్రమే లక్ష్యంగా చేపట్టిన నవోదయం 2.0 కార్యక్రమం కోసం కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు సంతోషంగా ఉంది. ప్రజల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా చేపట్టిన ఈ బడ్జెట్ రాష్ట్రాన్ని విజన్ 2047 లక్ష్యం వైపు నడిపించడం లో కీలక పాత్ర పోషిస్తుందని నమ్మకం పెరిగిందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Next Story