మద్యం కేసులో ఎంతటివారున్నా చర్యలు తప్పవు: మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

by Vemula.Srinu Prasad |

ములకల చెరువు కల్తీ మద్యం కేసులో ఎంతటివారున్నా చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు...

మద్యం కేసులో ఎంతటివారున్నా చర్యలు తప్పవు: మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ములకల చెరువు కల్తీ మద్యం సంఘటనలో ఎంతటివారున్నా చర్యలు తప్పవని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసు(Fake Liquor Case)కు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారని, 30 కేన్ల నకిలీ మద్యాన్ని, కొన్ని కార్టన్లు, ఫేక్ లేబుళ్లు, క్యాప్ సీలింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తెనాలి(Tenali)కి చెందిన కొడాలి శ్రీనివాస్‌కు ఈ నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉందని చెప్పారు. జయచంద్రా రెడ్డి అనే వ్యక్తికి కూడా భాగస్వామ్యం ఉందని, ఇబ్రహీంపట్నానికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి షాపులపైనా తనిఖీలు జరిగాయన్నారు. జనార్దన్ సోదరుడు అద్దెపల్లి జగన్ మోహన్ రావును కూడా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్‌కు ఈ కేసుతో సంబంధం ఉందని టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే పార్టీ పరంగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. అంతేకాదు నిర్లక్ష్యం వహించిన ఎక్సైజ్ ఎస్ఐని సస్పెండ్ చేశామన్నారు. ఈ ఘటన బాధ్యులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా నకిలీ మద్యం కేసుతో సంబంధం ఉన్న తెనాలికి చెందిన కొడాలి శ్రీనివాసరావుపై వైసీపీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మంత్రి రవీంద్ర వ్యాఖ్యానించారు.

Next Story