- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు తప్పదు: మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు
by Vemula.Srinu Prasad |
త్వరలో వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డు తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు...

X
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ కార్యాలయానికి త్వరలోనే టూలెట్ బోర్డు తప్పదని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) సంచలన జోస్యం చెప్పారు. మాజీ సీఎం జగన్(Former Cm Jagan) కారు కింద పడి సింగయ్య అనే కార్యకర్త చనిపోయిన ఘటన రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సింగయ్య మృతిపై వైసీపీ(Ycp) నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సింగయ్య మృతితో సంబంధం లేదనప్పుడు పరామర్శల డ్రామాలెందుకు ఆడారని ఆయన ప్రశ్నించారు. దొంగలతో వైఎస్ జగన్(Ys Jagan) ప్రయాణం చేస్తున్నారని, బియ్యం కొట్టేసిన దొంగతో ప్రెస్ మీట్ పెట్టించారని మాజీ మంత్రి పేర్ని నానిని ఉద్దేశించి కొల్లు రవీంద్ర విమర్శలు కురిపించారు.
Next Story






