చట్టం నుంచి తప్పించుకోలేరు: జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్

by Vemula.Srinu Prasad |

తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు....

చట్టం నుంచి తప్పించుకోలేరు: జగన్‌కు మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. అక్రమాస్తుల కేసులో ఈ రోజు నాంపల్లి కోర్టు(Nampally Court)కు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy) హాజరైన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థను హేళన చేసేలా జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు.11 సీబీఐ ఛార్జి షీట్లు, 9 ఈడీ ఛార్జిషీట్లలో జగన్ రెడ్డి ఏ1 అని చెప్పారు. ఇంతటి తీవ్రమైన ఆర్ధిక నేరాల్లో ఉండి కూడా కోర్టులకు హాజరవ్వకుండా డ్రామాలాడారని ధ్వజమెత్తారు. సుమారు రూ.43 వేల కోట్ల అవినీతిని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని చెప్పారు. అలాంటి జగన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు హారవుతూ బలప్రదర్శన చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. భారీ ఊరేగింపులు, ర్యాలీలతో కోర్టుకు హాజరవ్వడం న్యాయస్థానాలను అవమానించడమేనని మండిపడ్డారు. రప్పా రప్పా అంటూ బ్యానర్లతో ర్యాలీ చేయడం జగన్ రెడ్డి నేర మనస్థత్వానికి నిదర్శనమని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ‘‘క్విడ్ ప్రోకో, షెల్ కంపెనీలతో ప్రజల ఆస్తుల్ని జగన్ రెడ్డి కొల్లగొట్టారు. జగన్ రెడ్డి లాంటి క్రిమినల్ వెనుక నడిచే వారు ఆలోచించుకోవాలి.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.

Next Story