- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మంత్రి కొల్లు రవీంద్ర గొప్ప మనసు.. దత్తతకు యానాది కుటుంబాలు
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే పీ4 లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వం ప్రకటించిన పీ4 కార్యక్రమం లక్ష్యమని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. మచిలీపట్నం రూరల్ మండలం పెద్దపట్నం(Peddapatnam)లో పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అక్కడ నివాసం ఉంటున్న యానాది కుటుంబాల(Yanadi Families)ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యానాది కుటుంబాల స్థితిగతుల్ని చూసి చలించిపోయినట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైనా ఇంకా తిండికి, బట్టకు, నిలువ నీడ కోసం ప్రజలు కష్టాలు పడడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు గుర్తింపు కార్డులు లేవని, సంక్షేమ పథకాలు అందడం లేదని యానాది కుటుంబాలు చెప్పడంతో తక్షణమే ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని అధికారులను మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. చిన్న చిన్న గుడిసెల్లో నివాసం ఉండడం, ఉపాధి లేక తిండికీ సతమతమవుతున్నామని తెలియజేయడంతో ఇంటి నిర్మాణానికి ఎస్టీ కార్పొరేషన్ నుంచి నిధులు ఇప్పించాలని ఆదేశించారు. కొల్లు ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువులకు, కుటుంబంలోని వారికి ఉపాధి కల్పిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.






