చంద్రబాబు బ్రాండ్ వల్లే సాధ్యమైంది: మంత్రి కొల్లు రవీంద్ర

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-11-23 10:38:50  IST  )

సీఎం చంద్రబాబు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు సాధ్యమైందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు....

చంద్రబాబు బ్రాండ్ వల్లే సాధ్యమైంది: మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులతో సీఐఐ సదస్సు, రూ. 1.32 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ సంస్థ ఏర్పాటు సీఎం చంద్రబాబు వల్లే సాధ్యమైందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రకాకం జిల్లా ఒంగోలులో మైనింగ్ కార్యాలయం భవనానికి శంకుస్థాపన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి ఆదర్శంగా రాష్ట్ర మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు వ్యాపారపరమైన అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డ్యూయింగ్ బిజినెస్ కోసం చట్టాల్లో మార్పులు చేస్తున్నామని తెలిపారు. మైనింగ్ రంగాన్ని గత ప్రభుత్వం నాశనం చేసిందని, తాము క్రిటికల్స్ మినరల్స్ కోసం ప్రత్యేకమైన పాలసీని రూపొందిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

READ MORE ....

మనషిరూపంలో ఉన్న దేవుడు సత్యసాయి: సీఎం చంద్రబాబు

Next Story