పేదలకు గుడ్ న్యూస్: త్వరలోనే ఇళ్ల పట్టాలు

by Vemula.Srinu Prasad |

త్వరలోనే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించనున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు...

పేదలకు గుడ్ న్యూస్: త్వరలోనే ఇళ్ల పట్టాలు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. కృష్ణా జిల్లా(Krishna District) పెడన నియోజకవర్గం బంటుమిల్లి(Bantumilli)లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పెన్షన్ రూపంలో సుమారు యాభై వేల కోట్లు ప్రజలకు అందించామని తెలిపారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్, ఉచిత బస్సు లాంటి సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామన్నారు. త్వరలోనే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించనున్నామని చెప్పారు. ఇన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే మరోవైపు అమరావతి, పోలవరం(Amaravati, Polavaram) పనులను పూర్తి చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

అన్ని రంగాల్లో అభివృద్ధి

‘‘రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు నడిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలి.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

Next Story