- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఖాతాల్లోకి నగదు జమ చేస్తామన్న మంత్రి
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఆటో డ్రైవర్ కు ప్రభుత్వం త్వరలోనే రూ.15 వేలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతి ఆటో డ్రైవర్ కు ప్రభుత్వం త్వరలోనే రూ.15 వేలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) తెలిపారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించిన అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష (Gouthu Sirisha)తో కలిసి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. తొలి విడత కింద త్వరలోనే రైతుల ఖాతాల్లో రూ.7 వేలు వేస్తామని పేర్కొన్నారు.
ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, గత పాలకుల హయాంలో రాష్ట్రం నుంచి తిరిగి వెళ్లిపోయిన సంస్థలు మళ్లీ తిరిగి వస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడి హయాంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్తుంటే.. వైసీపీ నేతలు దానిని అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారని, కుల, మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి.. అల్లర్లు జరిగేలా ప్రేరేపిస్తున్నారని మండిపడ్డారు.






