- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
త్వరలో పేర్ని నాని అరెస్ట్..?.. మంత్రి కొల్లు రవీంద్ర సంచలన కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) త్వరలోనే అరెస్ట్ కాబోతున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) తెలిపారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Mla Vallabhaneni Vamsi) అరెస్ట్‌పై స్పందించిన కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ బియ్యం కేసు(PDS Rice Case)లో నాని అరెస్ట్ ఉంటుందని ఆయన చెప్పారు. టీడీపీ టికెట్‌పై గెలిచి చంద్రబాబు(Chandrababu)నే తిట్టిన వ్యక్తి వల్లభనేని వంశీ అని మండిపడ్డారు. ఈ పరిస్థితి తెచ్చిన జగన్‌ను వంశీ తిట్టాలన్నారు. బందరులో బియ్యం దొంగ పేర్ని నాని ఉన్నాడని వ్యాఖ్యానించిన కొల్లు రవీంద్ర.. పీడీఎస్ రైస్ కేసులో త్వరలోనే అరెస్టు ఉంటుందన్నారు. గుడివాడలో గుట్కా కింగ్ ప్రస్తుతం అడ్రస్ లేడని ఎద్దేవా చేశారు. కర్మఫలం ఏ ఒక్కరినీ వదలదని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
కాగా గుడివాడ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. అయితే మరికొంతమంది వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేయబోతున్నారని రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నేతలపై బూతులతో విరుచుకుపడిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే వారిపై పోలీసులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.. పీడీఎస్ రైస్ మాయం విషయంలో మచిలీపట్నలంలో నమోదైన కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం బెయిల్ తెచ్చుకుంది. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని అరెస్ట్ త్వరలో ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.