- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆధారాలు చూపకుండా పారిపోతున్నారు: పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
మచిలీపట్నం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు..

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నం అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పట్టణం ఎదుర్కొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో గుంతలు లేని రోడ్ల నిర్మాణంతో పాటు, రూ. 28 లక్షల వ్యయంతో తాగునీటి సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభించామని ఆయన వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో మున్సిపాలిటీ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారని, ప్రస్తుత ఎంపీ వల్లభనేని బాలశౌరి, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ రావు కృషితో కేంద్రం నుంచి వచ్చిన నిధులను వినియోగిస్తూ పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
పారిపోతున్నారు..
ఇదే క్రమంలో మాజీ మంత్రి పేర్ని నానిపై కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో ఇనుము దొంగిలించారంటూ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని, ఆధారాలు చూపమంటే పారిపోతున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో 'కరగ్రహారం లే అవుట్' పేరుతో పేదల భూములను తక్కువ ధరకు కొని, ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి పెద్ద ఎత్తున దోచుకున్నారని మంత్రి ఆరోపించారు. కనీసం ఇళ్లు కట్టుకోవడానికి వీలులేని ప్రాంతాల్లో లే అవుట్లు వేసి సౌకర్యాలు కల్పించకుండా ప్రజలను మోసం చేశారని, నిత్యం మీడియా ముందుకు వచ్చి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.






