మరో కుట్ర బయపడింది: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |

జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోవడానికి జగనే కారణమని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు...

మరో కుట్ర బయపడింది: జగన్‌పై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగి 29 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే మరణాలు ముమ్మాటికీ జగన్ హత్యలేనని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. జగన్ ఐదేళ్ల పాలనంతా కల్తీ, దోపిడీ, అవినీతేనని గుర్తు చేశారు. అడ్డగోలుగా మద్యం రేట్లు పెంచడంతోనే ప్రజలు నాటు సారాకు అలవాటు పడ్డారని వ్యాఖ్యానించారు. జంగారెడ్డిగూడెంలో సారా వ్యాపారం చేసింది వైసీపీ నేతలేనని, అక్రమాలన్నీ విచారణలో బయటకొస్తున్నాయన్నారు. నాటి కేసును మసిపూసి మారేడు కాయ చేయాలని జగన్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ సిట్ విచారణలో అన్నీ వెలుగులోకి వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు

కల్తీ మద్యం మళ్లీ తయారు చేసి...

గత ఐదేళ్లు ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారు చేసిన అనుభవంతో మళ్లీ తయారు చేసి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై వేయాలనుకున్నారన్నారు. చివరికి వారే అడ్డంగా దొరికి జైలుపాలయ్యారని, తాజాగా నెల్లూరులో ఒక వృద్ధుడితో ఐదు మద్యం బాటిళ్లు కొనుగోలు చేయించి, అతనికి తెలియకుండా వీడియోలు తీసి, బెల్టు షాపుల కోసం అంటూ సోషల్ మీడియాలో హడావుడి చేశారన్నారు. చివరికి కొనుగోలు చేసిన వృద్ధుడే వచ్చి కొంత మంది డబ్బులిచ్చి కొనుగోలు చేయించారని చెప్పడంతో మరో కుట్ర బయటపడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు జగన్ రెడ్డి అండ్ కో కుట్రలు సిగ్గుచేటన్నారు. తప్పు చేసినోళ్లను వదిలిపెట్టబోమని, తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

Next Story