జగన్‌కు ఆ అంశంపై మాట్లాడే అర్హత లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

by Naga Rani Yarlagadda |

కల్తీ మద్యం అంశంపై మాట్లాడే అర్హత మాజీ సీఎం వైఎస్ జగన్ కు లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

జగన్‌కు ఆ అంశంపై మాట్లాడే అర్హత లేదు : మంత్రి కొల్లు రవీంద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: కల్తీ మద్యం అంశంపై మాట్లాడే అర్హత మాజీ సీఎం వైఎస్ జగన్ కు లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. గురువారం గాజువాకలో.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తో కలిసి ఎక్సైజ్ సురక్ష యాప్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఆయన మద్యం బాటిళ్లను స్కాన్ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కొల్లు రవీంద్ర.. 2014-19 మధ్య కాలంలోనే తమ హయాంలో ట్రాక్ అండ్ ట్రేస్ పద్ధతిని తీసుకొచ్చామని గుర్తు చేశారు.

కానీ.. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అధికారంలోకి వచ్చాక.. వ్యవస్థల్ని నాశనం చేసి కల్తీ మద్యాన్ని విక్రయించారని ఆరోపించారు. మద్యాన్ని కల్తీ చేసి అమ్మిన వైసీపీ.. ఇప్పుడు ఆ నెపాన్ని కూటమి ప్రభుత్వంపై మోపేందుకు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చి.. ఆ హామీపైనే గెలిచి అధికారంలోకి వచ్చి.. కల్తీ మద్యం అమ్మిన జగన్ కు.. కల్తీ మద్యం అంశంపై మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో 80 శాతం ఆల్కహాల్ అమ్మకాలు డిజిటల్ పేమెంట్ల ద్వారానే జరగుతున్నాయని, ఇదే తమ ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.

Next Story