ఐదేళ్లు పీకలు కోసి.. ఇప్పుడు నీతులు చెబుతారా: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్

by Vemula.Srinu Prasad |

వైఎస్ జగన్ అనే అరాచక శక్తిని మహాత్ముడు అనేలా చూపించేందుకు కొంత మంది స్వయం ప్రకటిత మేథావులు పడుతున్న తాపత్రయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్లు బడుగు బలహీన వర్గాల ప్రజల పీకలు కోసి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు..

ఐదేళ్లు పీకలు కోసి.. ఇప్పుడు నీతులు చెబుతారా: వైసీపీ నేతలపై మంత్రి ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్(Ys Jagan) అనే అరాచక శక్తిని మహాత్ముడు అనేలా చూపించేందుకు కొంత మంది స్వయం ప్రకటిత మేథావులు పడుతున్న తాపత్రయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ(Tdp) కేంద్రకార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న ఐదేళ్లు బడుగు బలహీన వర్గాల ప్రజల పీకలు కోసి.. ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని తామే ఉద్దరించామంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల్ని రోడ్డున పడేశారని, అన్ని రంగాలను సర్వ నాశనం చేశారని మంత్రి కొల్లు రవీంద్ర గుర్తు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీఆర్ అని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని తెలిపారు.

‘‘తిరుపతి(Tirupati)లో బర్డ్స్, టాటా ఇనిస్టిట్యూట్ లాంటి ఎన్నో ప్రఖ్యాత ఆస్ప్రతులు ఏర్పాటు చేశారు. చివరికి మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎయిమ్స్ ఏర్పాటు చేస్తే.. ఆ సంస్థకు మంచినీరు కూడా ఇవ్వకుండా జగన్ వేధించాడు. కూటమి అధికారంలోకి వచ్చాక కృష్ణా నది నుండి పైపులైన్ ఏర్పాటు చేసి నీరు అందించాం. ఎప్పుడో కట్టించిన ఎన్టీఆర్ యూ నివర్శిటీ పేరు మార్చుకోవడం తప్ప జగన్ రాష్ట్ర వైద్య రంగంలో చేసిందేంటి?’’ అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.

‘‘పేదలకు నాణ్యమైన వైద్యం, పేద విద్యార్ధులకు మెరుగైన విద్య అందించే లక్ష్యంతో ప్రకటించిన పీపీపీ విధానం గురించి కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు. జగన్ రెడ్డి ప్రభుత్వ సీట్లలో 50 శాతం సీట్లు ప్రైవేటుకు కేటాయించేలా నిర్ణయిస్తే.. పీపీపీ విధానంలో అధనంగా 220 సీట్లు తీసుకొచ్చి 110 సీట్లు ప్రైవేటుకు ఇచ్చేలా కూటమి నిర్ణయించింది. జగన్ రెడ్డి 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తే.. పీపీపీ విధానంలో కేంద్ర కోటా కింద 15 శాతం సీట్లు ఏపీకి వస్తున్నాయి. జగన్ రెడ్డి చెప్పిన విధానంలో మెడికల్ కాలేజీలు ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు. కానీ పీపీపీ విధానంలో రెండేళ్లలోనే పది మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 1750 సీట్లు అధనంగా సాధించేలా సన్నాహాలు చేస్తున్నాం.’’ అని మంత్రి తెలిపారు.

‘‘అభివృద్ధిని అడ్డుకోవడం లక్ష్యంగా జగన్ అండ్ కో ఆది నుండి మెడికల్ కాలేజీల విషయంలో రాద్దాంతం చేస్తోంది. ప్రపంచం మొత్తం మెచ్చి అమలు చేస్తున్న పీపీపీ విధానాన్ని విమర్శించడంతో పాటుగా, ఎవరైనా ముందుకొస్తే ఊరుకునేది లేదని బెదిరించడం జగన్ రాక్షస ప్రవృత్తికి నిదర్శనం. ఈ రోజు మెడికల్ కాలేజీల గురించి నీతులు చెబుతున్న జగన్ రెడ్డి 107, 108, 133 జీవోల ద్వారా మేనేజ్ మెంట్, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కేటాయింపుపై మాట్లాడరెందుకు? పీపీపీ విధానంలో రెండేళ్లలో నిర్మాణాలన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. విమర్శలు చేయడానికి జగన్ సహా కుహానా మేథావులు సిగ్గుపడాలి.’’ అని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

Next Story